Madhava Swamy Temple Kurnool

జై శ్రీమన్నారాయణ    జై లక్ష్మీ మాధవ స్వామి ప్రసన్న:      శ్రీ మతే రామానుజాయ నమః

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గోరంట్ల మాధవ స్వామి దేవస్థానము గోరంట్ల గ్రామము,కోడుమూరు మండలం,
కర్నూలు జిల్లా.

భక్తులారా !

స్వస్తిశ్రీ చాంద్రమానేన శుభకృత్ నామ సం.ర ఫాల్గుణ శుద్ధ త్రయోదశి మఖా నక్షత్రము మొదలు 05-03-2023 ఆదివారం మొదలు 16-3-2023 గురువారం నవమి వరకు శ్రీ పాంచరాత్ర దివ్య ఆగమశాస్త్ర క్రమముగా కార్యక్రమములు ఈ క్రింది విధంగా జరుపబడును. కావున భక్తులందరు విచ్చేసి స్వామివారిని దర్శించి తరింతురని ప్రార్ధన.

శ్రీ స్వామి వారి ఉత్సవ కార్యక్రమములు

05-03-2023  పుణ్యాహవాచనము, శుద్ధ  త్రయోదశి ఆదివారం మఖా నక్షత్రయుక్త రాత్రి శ్రీ విష్వక్సేన పూజ.

06-03-2023  అంకురార్పణము, రక్షాబంధనము శుద్ధ చతుర్దశి సోమవారం ధ్వజారోహణం రాత్రి భేరి పూజ సింహోత్సవం

07-03-2023  శుద్ధ  పౌర్ణమి మంగళవారం శేషోత్సవం (బండి సేవ)

08-03-2023  బహుళ పాడ్యమి బుధవారం హనుమంతోత్సవం

“09-03-2023 బహుళ విదియ గురువారం రాత్రి చిత్త నక్షత్రయుక్త కుంభ లగ్నమందు శ్రీ వారి కళ్యాణోత్సవము, గరుడోత్సవము (ప్రభోత్సవము) (తెల్లవారితే శుక్రవారం)”

10-03-2023 బహుళ  తదియ శుక్రవారం గజోత్సవము

11-03-2023 బహుళ  చవితి శనివారం  శిభికోత్సవము

12 -03 -2023 బహుళ పంచమి ఆదివారం  పల్లకీసేవ

13-03-2023 బహుళ షష్ఠి సోమవారం అనూరాధ నక్షత్రయుక్త యందు  రథారోహణము

“14 -03 -2023  బహుళ సప్తమి మంగళవారం శ్రీ వారి రథోత్సవము”

15-03-2023 బహుళ  అష్టమి బుధవారం  పారువేట (అశ్వవాహనం )

16-03-2023 బహుళ నవమి  గురువారం హంసవాహనం , వసంతోత్సవం , చక్రస్నానం , రాత్రికి కంకణ విసర్జనం , శుభం .

 

1 . శ్రీ స్వామి వారి  వార్షిక బ్రహ్మోత్సవం సందర్భమున    05-03-2023 వ   తేదీ  నుండి 16-03-2023 వరకు అన్నదానం జరుపబడును.

2 .ఆలయ అభివృద్ధి పనులకు  విరివిగా విరాళములు ఇవ్వవలసినదిగా కోరడమైనది . భక్తులు శ్రీ స్వామి వారికి సమర్పించు కానుకలు , ముడుపులు వగైరా హుండీలో వేయవలెను.

గమనిక : 1-06-2011వ  సంవత్సరము నుండి ప్రతి శనివారం  శ్రీ మాధవస్వామి దేవాలయము నందు భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుపబడుచున్నది . కావున ఈ కార్యక్రమమునకు  ధన , ధాన్య, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలని  భక్తులను కోరుచున్నాము .

గమనిక : అన్నధానమునకు శాశ్వత సభ్యులుగా చేరి తరించండి. అన్నదానము శాశ్వత  చందా :5116 /- రూపాయలు

రండి ! విచ్చేయండి!! శ్రీ గోరంట్ల మాధవ స్వామి వార్షిక కళ్యాణ రథోత్సవము చూచి  తరించండి !!!

తోడగునయ్య ,దేహ గజదొంగల పట్టి వధించునయ్యపా
రాడు ప్లవంగ తత్వ హృదయమ్ము పవిత్ర మొనర్చునయ్య నా
గోడును మాన్పునయ్య బుధ కోటి జపించెడి మంత్రమయ్య నీ
మూడు సువర్ణముల్ పలుకపూర్వతపోబలమయ్యమాధవా!!

భావం: మాధవా అను నీ మూడు సువర్ణాక్షరాలు నాకు ఎల్ల వేళలా తోడు, నా లోపలి కామ క్రోధాది శత్రువు లను వధించే ఖడ్గం, విచ్చల విడిగా పారా డే నా మనస్సు ను, హృదయాన్ని పవిత్రం చేసి నారదాది పండితులచే నిరంతరము గానం చేయబడే మహా మంత్రం. నీ మూడు అక్షరాలు పలకడం నా పూర్వ జన్మ తపోబలమ్…
రచన : MV వేంకట రమణా చార్యులు

Gorantla Madhava Swamy Jatara